Saturday, April 20, 2024

‘కాళేశ్వ‌రం’ ప్రాజెక్ట్ కి జాతీయ‌స్థాయిలో గుర్తింపు

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కి అరుదైన గుర్తింపు ల‌భించింది. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కార్పొరేష‌న్ కి కేంద్ర ప్ర‌భుత్వ‌రంగ‌సంస్థ రూర‌ల్ ఎల‌క్ట్రిఫికేష‌న్ కార్పొరేష‌న్ నుంచి జాతీయ‌స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకుని లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసి.. రైతులకు గోదావరి జలాలను అందుబాటులోకి తీసుకురావడటంలో సఫలీకృతమైంది. కాళేశ్వరం సమీపాన మేడిగట్ట వద్ద, మేడిగడ్డ శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య‌ అన్నారం, సుందీళ్ల గ్రామాల వద్ద కాలువలు, సోరంగ మార్గాలు, జలశాయాలు, నీటి పంపినీ వ్యవస్థలు, ఎత్తి పోతల పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాలకు సాగు నీరు, తాగు నీరందించేందుకు సీఎం కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును 2016 లో కేసీఆర్ సర్కార్‌ ప్రారంభించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement