Saturday, April 20, 2024

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. రాజమౌళి హింట్ ఇచ్చాడు!

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఈ మధ్య బాగా వినిపిస్తోంది.  జూనియర్ పాలిటిక్స్ లోకి రావాలి అనేది చాలా మంది అభిమానులు అభిలాష. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్.. తర్వాత పార్టీకి కొంచం దూరంగా ఉంటూ వస్తున్నారు. తాత వారసత్వం పుణికి పుచ్చుకున్న నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు పొందారు. గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది. అభిమానులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయనను పదేపదే కోరుతున్నారు.

సినిమాల పరంగా జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో ‘ఇప్పుడు సమయం.. సందర్భం కాదు. ఓ రోజు కాఫీ తాగుతూ మనమే కబుర్లు చెప్పుకుందాం’ అని చెప్పాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు స్వీకరించబోతున్నాడన్న వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. దీనికి కారణం ఉగాదికి విడుదలైన RRR పోస్టరే.

ఉగాది పండుగను పురస్కరించుకుని దర్శకుడు రాజమౌళి.. RRR నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసున్న ఓ ఫొటోను విడుదల చేశాడు. అందులో తారక్ తలకు పసుపు రంగు రిబ్బన్ కట్టుకుని కనిపించాడు. దీంతో అతడు పొలిటికల్ ఎంట్రీని పరోక్షంగా వెల్లడించాడని చెబుతూ.. నందమూరి ఫ్యాన్ పేజీలలో కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో వీటికి మద్దతుగా ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు అనేక సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, లేక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సంక్షోభంలో ఉన్న ప్రధానంగా వినిపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ బాధ్యత తీసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. దీనిపై ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారే తప్పా.. ఆయన మనస్సులో ఏముందో మాత్రం చెప్పడం లేదు. కొందరి టీడీపీ కార్యకర్తల మనసులో తారక్ పార్టీని టేకోవర్ చేసుకోవాలన్న తపన బలంగా కనిపిస్తుంది. నటుడిగా తారక్ను అభిమానిస్తున్నవారు మాత్రం టాప్ హీరోగా కొనసాగుతున్న ఈ సమయంలో రిస్క్ వద్దని మరికొంతకాలం నటుడిగా కొనసాగలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement