Thursday, April 25, 2024

RRR: గర్జిస్తున్న యంగ్ టైగర్.. ‘కొమురం భీమ్’​ కొత్త లుక్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టార్ ‘ఆర్​ఆర్​ఆర్’. కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మళయాలం బాషాల్లో విడుదల కానింది. దీంతో మూవీ యూనిట్ సినిమా ప్రమోషన్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన టీజర్, పాటలు విడుదలై సినిమాపై అంచనాలు పెంచాయి.

తాజాగా ఈ మూవీలో ఎన్టీఆర్ పోషించిన కొమురం​ భీమ్​ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు. అల్లూరిసీతరామరాజుగా నటించిన రామ్​చరణ్​కు సంబంధించిన​ కొత్త పోస్టర్​ను ఈ రోజు సాయంత్రం 4గంటలకు రిలీజ్​ చేయనున్నారు. ఇక, డిసెంబరు 9న ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement