Thursday, August 5, 2021

బ్రిటన్ ప్రధానికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అమెరికా అధ్య‌క్షుడు.. ఎంటో తెలుసా?

బ్రిట‌న్‌లో జీ7 దేశాల స‌ద‌స్సు జ‌రుగుతోంది. ఈ స‌ద‌స్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. అమెరికా, బ్రిట‌న్ మ‌ధ్య ఉన్న బ‌ల‌మైన బంధానికి సూచిక‌గా రెండు దేశాల అధినేత‌లు ఒక‌రికొక‌రు బ‌హుమ‌తులు ఇచ్చుకున్నారు. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్ర‌త్యేక బ‌హుమ‌తిని తీసుకొచ్చారు. పూర్తిగా చేత్తో త‌యారు చేసిన సైకిల్‌ను ఆయ‌న‌కు బ‌హుక‌రించారు. 

బ్రిటన్ ప్రధానికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అమెరికా అధ్య‌క్షుడు.. ఎంటో తెలుసా?

ఈ సైకిల్‌పై బ్రిట‌న్ జెండా గుర్తు ఉంటుంది. బ్రిట‌న్ జెండాలో ఉండే బ్లూ, రెడ్ క‌లర్స్‌లో సైకిల్ ఉంది. ఈ సైకిల్ ఖ‌రీదు ఆరువేల డాల‌ర్లు. ఇక, బ్రిట‌న్ ప్ర‌ధాని జాన్సన్‌.. అమెరికా అధ్య‌క్షుడి కోసం అదే రేంజ్‌లో అదిరిపోయో గిఫ్ట్‌ను అంద‌జేశారు. 19వ శ‌తాబ్దంలో అమెరికాలో బానిస‌త్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన ఫెడ్రిక్ డ‌గ్ల‌స్ ఫొటోను బ‌హుమ‌తిగా అంద‌జేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News