Thursday, April 25, 2024

Spl Story: కలవరపెడుతున్న ఆఫ్రికన్​ స్వైన్​ ఫ్లూ.. వందలాదిగా చనిపోతున్న పందులు!

పందుల పెంపకందారులు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జార్ఖండ్​ రాష్ట్రంలో వందలాదిగా పందులు మృత్యువాత పడుతున్నాయి. దీనికంతటికీ ఆఫ్రికన్​ స్వైన్​ ఫీవర్​ (ASF) కారణమని వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. అయితే.. నెల రోజుల్లోనే అంటే జులై 27 నుంచి ఆగస్టు 28 వరకు దాదాపు 1100 పందులు చనిపోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక హెల్ప్​లైన్​ ఏర్పాటు చేసి 24 జిల్లాల్లో అలర్ట్​ కూడా జారీ చేశారు.

– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ

జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీ జిల్లాలో జులై 27 నుండి ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ASF) కారణంగా 1100కు పైగా పందులు చనిపోయాయి. దేశంలో మొదటిసారిగా ఫిబ్రవరి 2020లో అస్సాంలో ఈ ఆఫ్రికన్​ స్వైన్​ ఫ్లూని కనుగొన్నారు. ఆ తర్వాత ఎక్కువగా జార్ఖండ్​ రాష్ట్రంలోనూ దీని ఇంపాక్ట్​ ఎక్కువగా ఉంది.  కాగా, ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ శశి ప్రకాష్ ఝా మాట్లాడుతూ “జులై ప్రారంభంలో భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఎడి)కి పరీక్ష కోసం కొన్ని నమూనాలను పంపించాం. ఆ నివేదికల్లో ఆఫ్రికన్​ స్వైన్​ ఫ్లూ (ASF) సోకుతున్నట్టు  తెలింది. రాష్ట్రంలో ASF కారణంగా సుమారు 1100 పందులు చనిపోయాయి”అన్నారు.

ఆఫ్రికన్​ స్వైన్​ ఫ్లూ (ASF) అనేది పందులకు సోకే అంటువ్యాధి అని.. ఇది హెమరేజిక్ వైరల్ వ్యాధి అని వెటర్నరీ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. అయితే ఇది జంతువుల నుండి మనుషులకు సంక్రమించదని తెలుస్తోంది. పరిస్థితి తీవ్రతను పసిగట్టిన పశుసంవర్థక శాఖ ‘చేయాల్సినవి’, ‘చేయకూడనివి’ వంటి జాబితాను తయారు చేసింది. వీటిని స్వైన్‌హెర్డ్ ల కోసం టోల్‌ఫ్రీ నంబర్ (18003097711)ను విడుదల చేసినట్లు అధికారి తెలిపారు. ఇప్పటివరకు రాంచీ జిల్లాలోనే ఎక్కువ పందుల మరణాలు నమోదవుతున్నప్పటికీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని మొత్తం 24 జిల్లాలకు అలర్ట్​ జారీ చేసినట్టు తెలిపారు.

అంతేకాకుండా పందుల పెంపకంలో మరణాలు, లేదా వ్యాధి విస్తరించకుండా అరికట్టేందుకు జంతువులు లేదా పంది మాంసం అమ్మకాలను నిలిపివేయాలని అధికారులు కోరారు. రాష్ట్రంలో ఎక్కడైనా పందులు చనిపోయినట్టు తెలిస్తే వెంటనే పందుల పెంపకందారులను డిపార్ట్ మెంట్ టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. మార్గదర్శకాల ప్రకారం జంతువుల కళేబరాన్ని ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా.. జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.

- Advertisement -

పిగ్రీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ “ఇక్కడ కంకే ఆధారిత ప్రభుత్వ పందుల పెంపకం ఫారంలో జులై 27 నుండి 666 పందులు చనిపోయాయి. పందుల పెంపకం ఫారంలో దాదాపు 1,100 పందులు ఉన్నాయన్నారు. చన్హో, కుచు, మెక్‌క్లస్కీగంజ్ మరియు ఖలారితో సహా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో సుమారు 100 పందుల మరణాలు నమోదయ్యాయని రాంచీ పశుసంవర్ధక అధికారి అనిల్ కుమార్ తెలిపారు. రాంచీలోని బిర్సా అగ్రికల్చర్ యూనివర్శిటీ (BAU) ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 30 పందులు చనిపోయాయి. అట్లానే .. ఫారంలో 600 పందులు ఉన్నాయి.

అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న తర్వాత మరణాల రేటు తగ్గిందని రాంచీ వెటర్నరీ కాలేజీ డీన్, సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ సుశీల్ ప్రసాద్ తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ డైరెక్టర్ విపిన్ బిహారీ మహతా మాట్లాడుతూ “ASFలో మరణాలు ఆకస్మికంగా సంభవించాయి. జంతువులకు జ్వరం లక్షణాలు వస్తాయి, తినడం మానేస్తాయి అట్లాంటి సమయంలోనే అవి చనిపోతాయన్నారు. అయితేఈ  ఏఎస్‌ఎఫ్‌ వ్యాధికి వ్యాక్సిన్ లేదని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement