Friday, April 26, 2024

జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష ప్రయాణం సక్సెస్..

ప్రపంచ కుబేరుడు అమెజాన్‌ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ముగిసింది. నలుగురు సభ్యులను మోసుకుంటూ నింగికి ఎగిసిన న్యూ షెపర్డ్ వ్యోమనౌక విజయవంతంగా రోదసిలో ప్రవేశించగా, అక్కడ కొన్ని నిమిషాలు గడిపిన అనంతరం బెజోస్ బృందం స్పేస్ కాప్స్యూల్ సాయంతో సురక్షితంగా భూమికి తిరిగొచ్చింది. స్పేస్ కాప్స్యూల్ పారాచూట్ల సాయంతో ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా ఎడారి ప్రాంతంలో ల్యాండైంది. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగివచ్చారు. పశ్చిమ టెక్సాస్‌ నుంచి రోదసీలోకి బయల్దేరిన బ్లూ ఆరిజిన్‌ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్‌ క్రాఫ్ట్.. తిరిగి 11 నిమిషాల్లో భూమికి చేరుకున్నది. సాధారణ మనుషులు కూడా అంతరిక్ష యాత్రలు చేయాలన్న ఉద్దేశంతోనే బెజోస్‌ ఈ యాత్రను చేపట్టినట్లుగా బ్లూ ఆరిజన్‌ సంస్థ వెల్లడించింది. ఈ యాత్రలో బెజోస్ తో పాటు 82 ఏళ్ల మహిళా పైలెట్ వేలీ ఫంక్ కూడా పాల్గొని, రోదసియాత్ర చేసిన పెద్ద వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement