Wednesday, April 24, 2024

జ‌య‌మ్మ పంచాయితీ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ చేసిన హీరో ‘నాని’..

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ గా వెలుగొందుతోన్న సుమ..వెండితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. జ‌య‌మ్మ పంచాయితీ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సీరియ‌స్ క్యారెక్ట‌ర్ లో మెర‌వ‌నుంద‌ట సుమ‌. జయమ్మ పంచాయితీ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీవపాళి సందర్భంగా విడుదల చేశాడు. అది బాగానే వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.

నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయించారు. జయమ్మ పంచాయితీలోని ఫస్ట్ సింగిల్ తిప్పగలనా అనే పాటను విడుదల చేశారు. ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన బాణీని అందించగా.. పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. రామాంజనేయులు మంచి సాహిత్యాన్ని రచించారు. సంగీత ప్రియులకు ఈ పాట నచ్చుతుంది. విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి.మ‌రి సుమ‌కి ఈ చిత్రం విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

https://www.youtube.com/watch?v=r2oEIK0IF5U
Advertisement

తాజా వార్తలు

Advertisement