Thursday, April 25, 2024

జాన్వీక‌పూర్ – సామాజిక కార్యకర్త ఓర్హాన్ అవత్రమణితో రిలేష‌న్ లో ఉందా

బాలీవుడ్ బ్యూటీ జాన్వీక‌పూర్ సామాజిక కార్య‌క‌ర్త ఓర్హాన్ అవ‌త్ర‌మ‌ణితో రిలేష‌న్ లో ఉందా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ఇటీవల గుడ్ లక్ జెర్రీ తార‌ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా త‌ను ఇటీవల హాజరైన ఒక పార్టీలో క్లిక్ చేసిన కొన్ని స్టిల్స్‌ను షేర్ చేసింది. జాన్వీ తన బాయ్‌ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణితో స‌న్నిహితంగా ఉన్న ఆ ఫొటోలు ఆమె ఫాన్స్‌, ఫాలోయ‌ర్స్ దృష్టిని ఆకర్షించాయి. ఆమె ఆ ఫొటోల‌ను షేర్ చేయ‌డం ఆల‌స్యం.. వైర‌ల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో జాన్వీ కపూర్, ఓర్హాన్ అవత్రమణి ప‌ర‌స్ప‌రం చాలా సౌకర్యవంతంగా, గాఢ‌మైన ప్రేమలో ఉన్నవారిలా క‌నిపిస్తున్నారు. నియాన్ పసుపు రంగు పొట్టి దుస్తులు, దానికి మ్యాచింగ్ ఫ్లోటర్స్‌లో జాన్వీ మెరిసిపోతుండ‌గా, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ పసుపు ప్యాంటు, బూట్లు, నలుపు టీ-షర్ట్‌లో కనిపిస్తున్నాడు. పార్టీలో ఈ జంట జాన్వీ కపూర్ కజిన్ అయిన నటి షనయ కపూర్, వారి కామ‌న్ ఫ్రెండ్స్‌తో క‌లిసి ఆహ్లాదంగా స‌మ‌యాన్ని గ‌డిపారు. ఇటీవ‌ల జాన్వీ, ఆమె చెల్లెలు ఖుషి క‌పూర్ ఊటీలో హాలిడేట్ గ‌డిపిన‌ప్పుడు, అక్క‌డ ఓర్హాన్ కూడా వారితో పాటు ఉన్నాడు. తాము ముగ్గురు క‌లిసున్న ఫొటోల‌ను జాన్వీ షేర్ చేసిన‌ప్పుడు అవి ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ త‌న రిలేష‌న్‌షిప్ స్టేట‌స్ గురించి జాన్వీ పెద‌వి విప్ప‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement