Thursday, April 25, 2024

దేవర జెండాకి కర్రనౌతా.. దేవర రథ చక్రానికి శీలనౌతా – బండ్ల గ‌ణేశ్ ట్వీట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో ఒక‌డిన‌ని చెబుతుంటారు న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేశ్. కాగా దేవరా అంటూ అనేక పవర్ ఫుల్ డైలాగ్స్‏తో బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్‏కు ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ జనసేనా పార్టీ ఆవిర్భావ సభపై వరుస ట్వీట్స్ చేస్తూ ఫ్యాన్స్‎ను ఉత్సాహపరుస్తున్నారు. ” వీరులారా ధీరులారా, జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను.

మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం” అంటూ ట్వీట్ చేశారు. దేవర జెండాకి కర్రనౌతా.. దేవర రధచక్రానికి శీలనౌతా .. అని.. ” ఇచ్చాపురం నించి హిందూపురం దాకా.. తడ నించి బెజవాడ దాకా.. జనసేన జెండా రెపరెపలాడాలి.. జనసేనాని జపం మారుమ్రోగాలి.. అంటూ వరుస ట్వీట్స్‏తో రచ్చ చేస్తున్నారు.

https://twitter.com/ganeshbandla/status/1502844693821808641

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement