Friday, March 29, 2024

జ‌న‌ని సాంగ్ పై రాజ‌మౌళి స్పంద‌న‌..రెండు నెల‌లు క‌ష్టప‌డిన కీర‌వాణి..

స్టార్ హీరోస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. కాగా ఈ చిత్రం నుండి జ‌న‌ని సాంగ్ ని రేపు న‌వంబ‌ర్ 26న విడుద‌ల చేస్తామ‌ని రాజ‌మౌళి వెల్ల‌డించారు. ఆ పాట ప్ర‌త్యేక‌త గురించి మీడియాతో రాజ‌మౌళి మాట్లాడారు. ఈ సినిమాలోని స‌న్నివేశాల‌న్నింటికీ జ‌న‌ని పాట ఆత్మ‌లాంటిద‌ని వివ‌రించారు..ఈ సినిమాలో భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ గుండెను తాకేలా ఉంటాయ‌న్నారు.

ఈ విష‌యాల‌ను పంచుకోవాల‌ని నేడు మీడియాతో మాట్లాడుతున్నాన‌ని తెలిపారు. భావోద్వేగానికి సంగీత రూపం ఇస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది. ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్లు మామూలుగా ఉండ‌బోవ‌ని అన్నారు. ఆర్ఆర్ఆర్‌లో బోలెడ‌న్ని యాక్ష‌న్ స్వీక్వెన్స్ ఉంటాయని వివ‌రించారు. హీరోల ఇంట్రడ‌క్ష‌న్ సీన్లు, ప్రీ క్లైమ్యాక్స్, క్లైమ్యాక్స్, యాక్షన్ సీక్వెన్స్ వంటివి బోలెడు ఉంటాయ‌ని చెప్పారు. రెండు నెల‌ల పాటు కీర‌వాణి ఈ పాట కోసం క‌ష్ట‌ప‌డ్డార‌న్నారు. తాను ఈ రోజు చేసేది సినిమా ప్రమోషన్ కాద‌ని, ప్ర‌మోష‌న్ అంటే వేరేలా ఉంటుంద‌ని వివ‌రించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement