Thursday, April 25, 2024

కృషి ఉంటే రుషి అవొచ్చని నిరూపిస్తున్న క్రికెటర్

జమ్మూకాశ్మీర్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై క్రికెట్ ఆడినవారి సంఖ్య వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అలాంటి కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల ఆమిర్ హుస్సేన్ మాత్రం విభిన్న ప్రతిభావంతుడిగా జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. అతడు చేతులు లేకపోయినా కాళ్లతో బౌలింగ్, మెడ సాయంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే అతడి టాలెంట్‌ వల్ల ఈనెల 8 నుంచి 15 వరకు షార్జాలో జరిగే దివ్యాంగ ప్రీమియర్ లీగ్‌లో ఛాన్స్ వచ్చింది. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో రెండు చేతులను పోగొట్టుకున్నా విజయపథంలో ఆమిర్ ఏ మాత్రం వెనుకబడలేదు. ఎంతో ఇష్టమైన క్రికెట్​లో శిక్షణ తీసుకుని అద్భుత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కాళ్లతోనే బౌలింగ్ చేస్తూ.. బ్యాట్స్​మెన్​ను కట్టడి చేస్తూ..​. అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు.

కాగా ఆమిర్ ప్రతిభపై అతడి తల్లిదండ్రులు స్పందించారు. ‘ఇది మేము గర్వించదగ్గ విషయం. పిల్లల విజయాన్నే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. షార్జాలో జరిగే క్రికెట్​ లీగ్​కు ఆమిర్​ ఎంపికవటం కన్నా గొప్ప విషయం ఏముంటుంది? మా కుమారుడు ఇంకా మరిన్ని అవకాశాలను అందుకుంటాడు. మరెన్నో పురస్కారాలు కైవసం చేసుకుంటాడన్న నమ్మకం ఉంది’ అంటూ ఆమిర్ తల్లి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement