Friday, March 29, 2024

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ … దీనికి చాలా స్పెష‌ల్స్ ఉన్నాయండోయ్ ..

ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో టైమ్ మెషిన్ తో క‌థ‌లు వ‌చ్చాయి.. ఈ టైమ్ మెషిన్ తో కాలాన్ని వెన‌క్కి … అత్యంత ముందుకి వెళ్ళొచ్చు. ఆదిత్య‌369లో హీరో బాల‌కృష్ణ ఇదే టైం మెషిన్ తో వండ‌ర్ ని సృష్టించారు. మ‌రి నిజంగా ఇలాంటి టైం మెషిన్స్ బ‌య‌ట కూడా ఉంటాయా అంటే.. ఔన‌నే అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.. నేటి టెక్నాల‌జీ ఎంతో డెవ‌ల‌ప్ అవుతుంది.. రోబోతో న‌డిచే హోట‌ల్స్ కూడా వ‌చ్చాయి.. ఇప్పుడు టైం మెషిన్ కూడా దాదాపు వ‌చ్చేసిన‌ట్లే.. దానిపేరే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.. అత్యంత పవర్‌ఫుల్. ఈ టెలిస్కోప్‌ని 14 దేశాలు కలిసి తయారుచేసాయి. 1200 మంది సైంటిస్టులు, ఇంజనీర్లూ దీని నిర్మాణంలో పాల్గొన్నారు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), కెనడా స్పేస్ ఏజెన్సీ కలిసి దీన్ని తయారుచేశాయి. ప్రస్తుతం ఈ టెలిస్కోప్‌ని స్పేస్‌క్రాఫ్ట్‌కి సెట్ చేస్తున్నారు. ఫైనల్ టెస్టింగ్ జరుగుతోంది. అది పూర్తయ్యాక… ప్యాక్ చేసి… ఫ్రెంచ్ గయానాకు తరలిస్తారు. అక్కడ డిసెంబర్ 18న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన అరియానే 5 రాకెట్ దాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. అ తర్వాత టెలిస్కోప్ నుంచి కంటిన్యూగా ఫొటోలు… నాసాకి వస్తూ ఉంటాయి.

ఇతర గ్రహాలపై జీవులు ఉన్నాయా అనేది తెలుసుకునేందుకు ఇది ఇప్పటివరకూ ఉన్న వాటిలో బెస్ట్ టెలిస్కోప్.ఈ టెలిస్కోపును లాంచ్ చేశాక… ఇది అంతరిక్షంలోకి వెళ్లి… పువ్వులా విచ్చుకొని… భూమికి లక్షల మైళ్ల అవతల… సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది తిరిగే ప్రాంతాన్ని సెకండ్ లాంగ్రేజ్ పాయింట్ అంటారు. ఇది భూమికీ, చందమామకీ ఉన్న దూరం కంటే 4 రెట్లు ఎక్కువ దూరం. సూర్యుడి చుట్టూ తిరిగితే వేడి సమస్య ఉంటుంది కదా.. అందువల్ల వేటిని తట్టుకునేలా దీనికి హీట్ సెన్సిటివ్ విజన్ ఉంది. దీన్నే సన్ షీల్డ్ అంటారు. ఇది టెన్సిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఈ సన్ షీల్డ్… అతి వేడి, అతి చల్లదనం నుంచి టెలిస్కోప్‌ను కాపాడుతుంది. ఈ టెలిస్కోపుకి 18 సెగ్మెంట్ ప్రైమరీ మిర్రర్ ఉంది. ఇది హబుల్ టెలిస్కోప్‌కి ఉన్న మిర్రర్ కంటే… 6 రెట్లు పెద్దది. అంతేకాదు… 100 రెట్లు ఎక్కువ శక్తిమంతమైనది. ఈ మిర్రర్ 6.5 మీటర్ల వ్యాసార్థంతో ఉంది. అందువల్లే ఈ టెలిస్కోప్ విశ్వ రహస్యాల్ని చూపించగలదు. మొత్తానికి ఈ టెలిస్కోప్ తో మ‌రో కొత్త ప్ర‌యోగ‌మే చేయ‌నున్నార‌న్న‌మాట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement