Friday, April 19, 2024

పీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్రకటించిన జెసిండా ఆర్డెర్న్‌

న్యూజిలాండ్‌ పీఎం జెసిండా ఆర్డెర్న్‌ వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికార లేబర్‌ పార్టీ సమావేశంలో వెల్లడించారు. లేబర్‌ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈనెల 22న ఓటింగ్‌ జరుగుతుందని చెప్పారు. సాధారణ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్‌ 14న జరుగుతాయని తెలిపారు. దీంతో ఆర్డెర్న్‌ పదవీ కాలం ఫిబ్రవరి 7 తర్వాత ముగియనుంది. వచ్చే ఎన్నికల్లో లేబర్‌ పార్టీ గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 2017లో జెసిండా ఆర్డెర్న్‌ తొలిసారిగా న్యూజిలాండ్‌ ప్రధానిగా ఎన్నికై భాగస్వామ్య పక్షాలతో కలిసి ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement