Wednesday, April 24, 2024

70ఏళ్ల‌లో ఎన్న‌డూ లేని నీటి క‌రువుతో అల్లాడుతోన్న – ఉత్త‌ర‌ ఇట‌లీ

70ఏళ్ల‌లో ఎన్న‌డూ లేని నీటి క‌రువుతో ఉత్త‌ర ఇట‌లీ అల్లాడుతోంది. దీంతో ఆ ప్రాంతంలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. పో న‌ది చుట్టు ఉన్న ప్రాంతాలు బీడు భూముల‌వుతున్నాయి. ఎమిలియా రోమ‌గ్న‌, ఫ్రూలీ వెంజియా గులియా, లొంబార్డీ, పీడ‌మాంట్‌, వెనిటో ప్రాంతాల‌కు ప్ర‌త్యేక ఎమ‌ర్జెన్సీ నిధుల ప్యాకేజీ ప్ర‌క‌టించారు. నీటి కొర‌త వ‌ల్ల ఇట‌లీ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల్లో 30 శాతం దిగుబ‌డి త‌గ్గ‌నున్న‌ది. ఈ ప్రాంతంలోని అనేక మున్సిపాల్టీల్లో నీటి వినియోగంపై ఆంక్ష‌లు విధించారు. ఊహించ‌ని రీతిలో అధిక ఉష్ణోగ్ర‌త‌లు, త‌క్కువ స్థాయిలో వ‌ర్షం న‌మోదు కావ‌డం వ‌ల్ల ఉత్త‌ర ఇట‌లీలో నీటి ఎద్ద‌డి ఏర్ప‌డింది. ఇట‌లీలో పో న‌ది అత్యంత పొడువైన‌ది. తూర్పు దిశ‌గా సుమారు 650 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌వ‌హిస్తుంది. న‌దిలోకి ఉప్పు నీరు ప్ర‌వ‌హిస్తోంద‌ని, దీంతో పో న‌ది ప‌రివాహాక ప్రాంతంలో ఉన్న పంటలు నాశ‌నం అవుతున్న‌ట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement