Saturday, April 20, 2024

Breaking: మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి పీఏ ప్ర‌భాక‌ర్ ఇంట్లో ఐటీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం

తెలంగాణ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి ప‌ర్స‌న‌ల్ సెక్రెట‌రీ ప్ర‌భాక‌ర్ ఇంట్లో ఐటీ (ఇన్‌క‌మ్ ట్యాక్స్‌) అధికారులు ఇవ్వాల (సోమ‌వారం) రాత్రి సోదాలు నిర్వ‌హిస్తున్నారు. మునుగోడు ఎన్నిక‌ల నేప‌థ్యంలో న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన ప్ర‌భాక‌ర్ ఇంట్లో ఈ సోదాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ప‌లు ట్రాన్సాక్ష‌న్ల‌కు సంబంధించిన వివ‌రాల‌పై అధికారులు ఆరా తీస్తున్న‌ట్టు స‌మాచారం. నల్గొండలో ఉంటున్న ప్రభాకర్​ ఇంట్లో ఐటీ అధికారుల సోదాల్లో భారీగా నగదు పట్టుబడ్డట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement