Tuesday, April 23, 2024

కొనసాగుతోన్న దాడులు..గజాలోని మీడియా సంస్థ ధ్వంసం

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఘర్షణలు వరుసగా అయిదో రోజు శనివారం కూడా కొనసాగాయి. గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేయగా.. ప్రతిగా ఇజ్రాయెల్‌పైకి హమాస్‌ మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయెల్‌ విమానాలు గాజాలో ఒక మసీదును ధ్వంసం చేశాయని పాలస్తీనా మత వ్యవహారాల శాఖ తెలిపింది. గాజాపై దాడుల్లో ఇప్పటి వరకు 132 మంది మరణించారని, వారిలో 32 మంది పిల్లలు, 21 మంది మహిళలు ఉన్నారని పాలస్తీనా అధికార వర్గాలు తెలిపాయి. మరో 950 మంది గాయపడ్డారని పేర్కొన్నాయి. వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ బలగాలతో జరిగిన ఘర్షణలో మరో 11 మంది పాలస్తీనా నిరసనకారులు మరణించారు. గాజా సిటీలోని అసోసియేటెడ్‌ ప్రెస్‌, అల్‌ జజీరాతో పాటు పలు వార్తా సంస్థల కార్యాలయాలు ఉన్న బహుళ అంతస్తుల భవంతిని ఇజ్రాయెల్‌ కూల్చివేసింది. భవనంలోని వారిని ఖాళీ చేయాలని ఆదేశించిన ఇజ్రాయెల్‌ మిలిటరీ.. గంట తర్వాత ఆ భవనాన్ని క్షిపణులతో నేలమట్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement