Saturday, April 20, 2024

కేసీఆర్‌ నేతృత్వంలో  సాగునీటి రంగం అద్భుతం.. మల్లన్నసాగర్‌ వరప్రదాయని: హరీష్‌రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తాగు, సాగునీటి రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయని, సాగునీటి ఫలితాలకు పండుతున్న పంటలే నిదర్శనమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. విపక్షాలు వాస్తవాలను ఒప్పుకోలేక దుష్ప్రచారం చేస్తున్నాయని, కాంగ్రెస్‌, భాజపాలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దేశం మననుంచి నేర్చుకునే అంత గొప్పగా సాగునీటి ప్రణాళికలు అమలు చేస్తున్నామని, స్మశాన తెలంగాణను మీరు ఆవిష్కరిస్తే… సస్యశ్యామల తెలంగాణను మేము ఆవిష్కరించామని, కృష్ణా నదీలో అదనపు నీటి కోసం కొట్లాడుతున్నామని తెలిపారు. శాసన సభలో జరగిన పద్దులపై మంత్రి హరీష్‌రావు సాగునీటి రంగంపై జరిగిన చర్చ సందర్భంగా సమాధానం ఇచ్చారు. ‘ తెలంగాణకు జరిగిన అన్యాయాలు, ఘోరాలకు ఈ ప్రాంత కాంగ్రెస్‌ నాయకుల మౌనమే కారణం. పది జిల్లాలకు మల్లన్నసాగర్‌ వరప్రదాయని. కమీషన్ల బుద్ధితో ఉన్న వారు, ఆ ప్రయత్నం చేసిన వారు వాటి గురించి మాట్లాడుతున్నారు. అవినీతి మురికి కూపంలో మునిగిపోయిన వారు రాద్దాంతం చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి అవగాహన లేకుండా, దుర్మార్గంగా మాట్లాడుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ప్రాణహిత చేవెళ్లకు 2007లో రూ. 17,875 కోట్లకు జీవో ఇచ్చారు. ఏం పని చేయకుండానే కేవలం 19 నెలల కాలంలోనే రూ. 38,500 కోట్లకు పెంచారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పుడు రూ. 40,300 కోట్లు అని చెప్పారు. ఏం పని చేయకుండానే ఎలా పెరిగింది . మీరు చేసిన తప్పులు సరిదిద్దడం తప్పా. తుమ్మిడి##హట్టి వద్ద నీళ్లు లేవు అని కేంద్రమే చెప్పింది. మీ తప్పులను సరిదిద్దింది సీఎం కేసీఆర్‌. మీరు ఖర్చు పెట్టిన డబ్బును సద్వినియోగం చేసేందుకే రీఇంజనీరింగ్‌ చేశారు. 160 టీఎంసీల నీటి లభ్యత అక్కడ లేదని పునరాలోచించుకోవాలని, పై రాష్ట్రాలు వాటా వాడుకుంటే మీకు అనుకున్నంత నీళ్లు ఉండవని, రీ ఇంజనీరింగ్‌ చేసుకోమని సెంటర్‌ వాటర్‌ కమిషన్‌ పలు సార్లు లేఖల ద్వారా చెప్పింది ‘ అని హరీష్‌రావు వివరించారు. ఢిల్లిdలో, మహారాష్ట్రలో, ఇక్కడ కాంగ్రెస్‌ ఉండి పక్క రాష్ట్రాన్ని ఎందుకు ఒప్పించలేదుని, తట్టెడు మట్టి తీయకుండానే సమస్యల వలయంలో ప్రాణహిత ప్రాజెక్టును ఇరికించారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. నీళ్లు ఉండే చోటుకు ప్రాజెక్టును మార్చి నిధులను సద్వినియోగం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కతుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో 16 లక్షల ఎకరాలకు అనుకుంటే, మేము 37 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ప్రాజెక్టును మార్చుకున్నామని తెలిపారు.
గోదావరి జీవనదిగా మార్చిన ఘనత కేసీఆర్‌దే..

గోదావరిని జీవనదిల మార్చడంతో పాటు భూ నిర్వాసితులకు నాలుగంతల పరిహారం ఇచ్చామని, అటవీ శాఖ, విద్యుత్‌ శాఖలకు చెల్లింపులు చేశామని మంత్రి తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ చరిత్రలో ఎన్నడు కూడా 14లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని, కాళేశ్వరం తొలి ఫలితం వరంగల్‌, నల్గొండ, సూర్యపేట జిల్లాలకు అందినదన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల హయాంలో చెరువులు, కాలువల్లో పల్లెర్లు, తుమ్మలు మొలిస్తే, మా హయాంలో బంగారు పంటలు పండిస్తున్నారని చెప్పారు. మిషన్‌ కాకతీయతో పాడి, పంట భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఉమ్మడి పాలనలో పాలమూరు పొలాల్లో ఎన్నడూ నీళ్లు పారలేదని మోటార్లు తెచ్చి బిగించలేదన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాకనే 10లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుందని, పాలమూరు నుంచి బొంబాయికి వెళ్లే బస్సులు బంద్‌ కావడం, పక్క రాష్ట్రాల నుంచి పాలమూరుకు పని కోసం వస్తున్నారని ఆయన వివరించారు.

ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లే పెట్టాం..
రాజీవ్‌ సాగర్‌ మార్చారని భట్టి విక్రమార్క అంటున్నారు. మేం రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు అయినా దేవుళ్ల పేరే పెట్టాం. వేరే పేర్లు పెట్టుకున్నామా… దేవుళ్ల పేర్లు పెడితే మీకు ఎందుకు బాధ. చచ్చిపోయిన వారి వేలు ముద్రలు వేసి కోర్టుల కేసులు పెట్టారు కాంగ్రెస్‌ నాయకులు. మేం ఆధారాలతో సహా వాస్తవాలు బయటపెట్టాం. కమీషన్ల కోసం, రియల్‌ ఎస్టేట్‌ కోసం చేసిన ప్రాజెక్టు అన్నరు. మల్లన్న సాగర్‌కు వస్తా అంటే భట్టితో పాటు మిగతా ఎమ్మెల్యేలను తీసుకువెళ్తా. నీళ్లను చూస్తే మీ కడుపు నిండుతుంది. కాంగ్రెస్‌ ఒక్కటే కాదు, బీజేపీ అతీతం కాదు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం. ఈ మట్టి మీద పుట్టి తల్లికి ద్రో#హం చేయడం సరికాదు. ఇలాంటి ప్రతిపక్షాలు మన రాష్ట్రంలో ఉండటం బాధాకరం. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణకు పట్టిన ఒక్కో దరిద్రం తొలగించుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల భావ దరిద్రం మాత్రం ఇంకా పోతలేదు. నాడు దాశరథి తెలంగాణ కోటి రతనాల వీణ అంటే, నేడు కోటి ఎకరాల మాగాణి అని సీఎం కేసీఆర్‌ చూపారు. తెలంగాణ ప్రజలకు నీళ్ల రంది లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. కేసీఆర్‌ గారు ఉన్నారనే ధీమా తెలంగాణ ప్రజలకు ఉంది ‘ అని అన్నారు.

కేంద్రం సహకరించడం లేదు..
‘ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదు. రాష్ట్రం ఏర్పడిన మొదటి నెలలోనే సెక్షన్‌ 3 కింద క్రిష్ణా నది వాటా గురించి నిలదీశాం. ఎన్నో సార్లు విన్నవించుకున్నాం. ఇప్పటి వరకు వాటా తేల్చరు. తెలంగాణకు అనుకూలమైంది చేయరు. వ్యతిరేకమైంది చేస్తరు. ఒక జాతీయ ప్రాజెక్టు కావాలని అడిగాం. సీఎం కేసీఆర్‌తో పాటు మా ఎంపీలు ఎన్నో సార్లు అడిగారు. కాని మొన్న బుందెల్‌ ఖండ్‌, కర్ణాటక ప్రాజెక్టులకు జాతీయ #హూదా ఇచ్చారు. మనకు ఎందుకు ఇవ్వరు. ఇక్కడి బీజేపీ ఎంపీలు ఢిల్లిలో నిలదీయాలి. తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ #హూదా తీసుకురావాలి. రాష్ట్ర బీజేపీ తమాషా చేస్తే, కేంద్ర బీజేపీ తమాషా చూస్తుంది. కేంద్ర బడ్జెట్‌లో గోదావరిని తీసుకుపోయి కావేరికి లింక్‌ చేస్తం అంటరు. ఇదెక్కడి పద్ధతి. నీళ్లు ఉన్నాయని మీరే అంటరు. నీళ్లు ఉంటే గోదావరి ప్రాజెక్టుల మీద ఎందుకు అనుమతి ఇవ్వరు. కేంద్రానికి డిమాండ్‌ చేస్తున్న. మాకు నీటి కేటాయింపులు పూర్తి చేసే దాకా, మా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేదాకా గోదావరి, కావేరికి లింకును తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోదు. రాజీవ్‌ సాగర్‌, ఇందిరా సాగర్‌ అంతర్‌ రాష్ట్ర వివాదాల్లోకి వెళ్లిపోయింది. మన రాష్ట్రం కంట్రోల్‌లో ఉండాలని, సీతమ్మ సాగర్‌ బ్యారేజీని మొదలు పెట్టాం. ఆంధ్రప్రదేశ్‌ ఇంకా కిరికిరిలు పెడుతుంది. ఎలాంటి సమస్యలు ఉండకూడదని ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్‌ చేసాం ‘ అని మంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement