Saturday, April 20, 2024

ఈ వైరల్ వీడియో నిజం కాదని తేల్చి చెప్పిన పోలీసులు

ఆస్పత్రుల్లో కరోనా రోగులను చంపేస్తున్నారంటూ ఓ వీడియో మంగళవారం నాడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. దీంతో ఈ వీడియోను ఓ కన్నడ న్యూస్ ఛానల్‌ కూడ ప్రసారం చేసింది. దీంతో ఈ వీడియోపై కర్ణాటక పోలీసులు స్పందించారు. అయితే సదరు ఛానల్ ప్రసారం చేసిన వీడియోలో ఉన్నది నిజం కాదని తేల్చిచెప్పారు. ఈ వీడియో రెండు క్లిప్‌ల కలయిక అని పోలీసులు తేల్చి చెప్పారు.

ఇంతకీ ఈ వీడియో ఏం ఉందంటే.. ఓ ఆస్పత్రిలో మంచంపై ఉన్న వ్యక్తిని చంపుతున్నట్లు చూపించారు. మంచంపై ఉన్న వ్యక్తి కరోనా పేషెంట్ కాదని, ఇది వాస్తవానికి మే 19,2020 బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి యూట్యూబ్‌లో వచ్చిన పాత వీడియో అని స్పష్టం చేశారు. డబ్బుల కోసం కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో సిబ్బంది చంపేస్తున్నారని ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement