Wednesday, May 25, 2022

ఐపీఎల్ బెట్టింగ్ ల‌పై – దేశ వ్యాప్తంగా నాలుగు ప‌ట్ట‌ణాల్లో సీబీఐ సోదాలు

దేశ వ్యాప్తంగా నాలుగు ప‌ట్ట‌ణాల్లోని ప‌ది ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హించింది సీబీఐ. ఐపీఎల్ బెట్టింగ్ ల‌కు పాల్ప‌డుతున్న ఆరోప‌ణ‌ల‌పై ఈ ద‌ర్యాప్తుని ప్రారంభించింది. ఈ మేర‌కు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది. కొందరు వ్యక్తులతో కూడిన నెట్ వర్క్ పాకిస్థాన్ నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఐపీఎల్ మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సీబీఐ దృష్టి సారించింది. ఈ నెట్ వర్క్ 2013 నుంచి పనిచేస్తోందని, రాజస్థాన్ తో బలమైన లింక్స్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లను స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేశారు. తాజా కేసుల్లో సీబీఐ జైపూర్, జోధ్ పూర్, హైదరాబాద్, ఢిల్లీ పట్టణాల్లో సోదాలు నిర్వహించింది. ఐపీఎల్ బెట్టింగ్ నెట్ వర్క్ సభ్యులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్ లోని సభ్యులతో చాట్ చేసిన ఆధారాలు ఆయా డివైజ్ లలో ఉన్నట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ మ్యాచ్ ఫలితాలపై బెట్టింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నట్టు సమాచారం ఉందని సీబీఐ వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement