Friday, April 26, 2024

ఐపీఎల్ వేలం… సామ్ కర్రన్ రూ.18.5 కోట్లకు దక్కించుకున్న పంజాబ్

ఐపీఎల్ మినీ వేలం కొనసాగుతోంది. ఈ వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్లపై కనక వర్షం కురిసింది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన వేలంలో పంజాబ్ కింగ్స్ అతణ్ని రూ.18.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో భారీ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా కర్రన్ రికార్డ్ బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ క్రిస్ మోరీస్ పేరిట ఉండగా.. తాజాగా ఇంగ్లాండ్ ఆటగాడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కర్రన్‌ను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరి వరకూ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ అతడి కోసం ధరను పెంచుకుంటూ పోయాయి. ఆఖర్లో లక్నో సూపర్ గెయింట్స్ బరిలోకి దిగినప్పటికీ.. రూ.32.2 కోట్ల పర్స్ ఉన్న పంజాబ్ కింగ్స్ భారీ ధరకు అతణ్ని దక్కించుకుంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సామ్ కర్రన్ ఆడటంతో.. అతణ్ని తిరిగి దక్కించుకోవడం సీఎస్కే చివరి వరకూ ప్రయత్నించింది. కానీ ఆ ఫ్రాంచైజీ వద్ద రూ.20.45 కోట్ల పర్స్ మాత్రమే ఉండటంతో వెనక్కి తగ్గింది.


ఐపీఎల్ వేలంలో ఇలా…
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పొందిన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ నిలిచారు.ఈ క్రమంలో సామ్ కరన్ ను రూ.18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకున్నారు.అదేవిధంగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నారు.ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్ కోసం సన్ రైజర్స్ రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టగా… ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కేమరాన్ గ్రీన్ ను రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు సన్ రైజర్స్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement