Sunday, May 16, 2021

పలువురు ఆటగాళ్లకు కరోనా.. నేటి ఐపీఎల్ మ్యాచ్ రద్దు

ఐపీఎల్‌ 2021 సీజన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లో చాలా మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా ఆటగాళ్లలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఉలిక్కపడ్డ ఫ్రాంఛైజీ సదరు ప్లేయర్స్‌ను ఐసోలేషన్‌కు తరలించింది. స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్‌‌తో సహా వరుణ్ చక్రవర్తి వంటి పలువురు ఆటగాళ్లు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో సోమవారం ఆర్‌సీబీతో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది.

అత్యంత సురక్షితమైన బయో బబుల్‌లో ఈ లీగ్ జరుగుతుండగా.. కేకేఆర్ ఆటగాళ్లు అస్వస్థతకు గురవ్వడం ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో లీగ్ సజావుగా నిర్వహించి టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వాలని బీసీసీఐ భావించింది. కానీ తాజా ఘటన లీగ్ రద్దుకు దారితీసేలా ఉంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ తరహాలో ఐపీఎల్ కూడా అర్థాంతరంగా వాయిదా పడుతుందా? అనే ఆందోళన నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News