Friday, April 19, 2024

Apple Iphone: ఐఫోన్​ లవర్స్​కి గుడ్​ న్యూస్​.. సెప్టెంబర్​ 7న ఐఫోన్​14 మెడల్​ ఫోన్ల ప్రారంభం!

ఆపిల్​ సంస్థ తన ఐఫోన్​ 14 సిరీస్​ని లాంచ్​ చేయడానికి రెడీగా ఉంది. దీనికి సంబంధించిన ఓ అప్​డేట్​ని ఆపిల్​ వెల్లడించింది. సెప్టెంబర్​ 7వ తేదీన ఐఫోన్​ 14 లాంచ్​ ఈవెంట్​ ఉంటుందని తన అధికారక ప్రకటనలో వెల్లడించింది. కాగా, కొత్గగా వచ్చే ఐఫోన్​ 14 మోడల్స్​ ఫోన్లు దాదాపు ఐఫోన్​ 13 మాదిరిగానే ఉండనున్నట్టు తెలుస్తోంది. దీంతో చాలామంది ఈ సారి అంత ఎగ్జయిటింగ్​గా లేరు. అయితే.. ఐఫోన్​ 14 మినీకి బదులుగా ఐఫోన్​14 మాక్స్​ని ఈ సారి లాంచ్​ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ తో పాటు.. ఐఫోన్ 14 మినీకి బదులుగా ఐఫోన్ 14 మాక్స్ అనే నాలుగు మోడళ్లను ఈ ఈవెంట్​లో రిలీజ్​ చేయనున్నట్టు టెక్​ ఎక్స్​పర్ట్​లు చెబుతున్నారు. 

ఇక.. ఐఫోన్​ 14 మోడల్​ ఫోన్లన్నీ బయోనిక్​ 15 చిప్​సెట్​తోనే రాబోతున్నట్టు సమాచారం. దీంతో ఐఫోన్​ లవర్స్​ ఈ ఫోన్లపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. అంతేకాకుండా డిజైన్​ పరంగా కూడా ఐఫోన్​ 13 మాదిరిగానే ఉండనున్నట్టు తెలుస్తోంది.  దీనిలో ప్రో మోడల్‌లు మాత్రమే ప్రధాన డిజైన్ అప్‌గ్రేడ్‌ ఉంటుందని అంతా భావిస్తున్నారు. అంటే వెనుకవైపు అదే డ్యూయల్.. రియర్ కెమెరా మాడ్యూల్, ముందు భాగంలో నాచ్‌ ఉండబోతోంది.

–ఐఫోన్ 14 గత ఏడాది ఐఫోన్‌ల మాదిరిగానే అల్యూమినియం ఫ్రేమ్‌లతో గ్లాస్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంటుందని, — ఇది 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేలోనే వస్తుందని తెలుస్తోంది. అయితే అధిక రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్​ చేస్తుందనే టాక్​ వినిపిస్తోంది. iPhone 13లో కనిపించే 60Hz డిస్‌ప్లేకి బదులుగా స్క్రీన్ 90Hz వద్ద రిఫ్రెష్ కానున్నట్టు సమాచారం. అంతేకాకుండా –ఐఫోన్ 14 సిరీస్ తాజా iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుందా లేదా అన్న విషయం కూడా ఇంకా వెల్లడించలేదు. రెండ్రోజుల క్రితమే ఐఓఎస్​ బీటా 16లో భాగంగా డెవలపర్​ 7, పబ్లిక్​ వెర్షన్​ 4ని రిలీజ్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement