Thursday, April 25, 2024

క‌రోనా బాధితుల కోసం – కేంద్ర ఆరోగ్య‌శాఖ ప‌లు సూచ‌న‌లు

క‌రోనాతో బాధ‌ప‌డుతూ తీవ్ర ల‌క్ష‌ణాల‌తో ప‌ది రోజుల‌కి పైగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల‌కు రెమ్ డెసివ‌ర్ వినియోగించాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ సూచించింది. క‌రోనా కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో బాధితుల‌కు అందించాల్సిన వైద్యం, మందుల‌పై కేంద్ర ఆరోగ్య‌శాఖ ప‌లు సూచ‌న‌లు చేసింది. ఆరోగ్యశాఖ నిర్ధారించిన అన్ని ప్రమాణాలు చేరుకున్నప్పుడే అత్యవసర వినియోగం కింద రెమ్​డెసివిర్​, టోసిలిజుమాబ్​ మందులను వినియోగించాలని తెలిపింది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు ఐదు రోజుల పాటు రెమ్​డెసివిర్​ వినియోగించాలని ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది.. ఆక్సిజన్​ సపోర్ట్​ అవసరం లేనివారికి, ఇన్​హోమ్​ సెట్టింగ్​లో (ఇంటివద్ద చికిత్స) లేని వారికి రెమ్​డెసివిర్ ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. RFT , LFTని పర్యవేక్షించుకోవాలి.

రెమ్​డెసివిర్ సిఫార్సు చేసిన మోతాదు: మొదటి రోజు 200 mgIV మిగతా నాలుగు రోజులు 100mgIV మోతాదులో ఇవ్వాలి. కొవిడ్​ బారిన పడి ఆక్సిజన్​ సపోర్ట్​ లేదా ఐవీఎం అవసరమై, స్టెరాయిడ్స్​కు స్పందించని వారికి మాత్రమే టోసిలిజుమాబ్​ను సూచించాలి. వైరస్ తో తీవ్రంగా ప్రభావితమై ఐసీయూలో చేరాల్సి వచ్చిన వారికి 24-48 గంటల్లోపు వినియోగిస్తే మంచిదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. టీబీ, ఫంగల్​, సిస్టెమిక్​ బ్యాక్టీరియల్​ ఇన్​ఫెక్షన్​ లేని వారికి మాత్రమే రెమ్​డెసివర్, టోసిలిజుమాబ్ మందులు ఇవ్వాలి. 60 ఏళ్లకు పైబడి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారిని హైరిస్క్​ కేటగిరీలోకి తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. టోసిలిజుమాబ్​ సిఫార్సు చేయబడిన మోతాదు: 4-6 mg/kg (60 కిలోల బరువున్న పెద్దలకు 400 mg) గంట వ్యవధిలో 100 ml NS ఇవ్వాలని సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement