Saturday, June 3, 2023

‘ఆమ్ ఆద్మీ’ లో చేరిన ఇందిరా శోభ‌న్ – ఇది సామాన్యుల పార్టీ అంటూ కితాబు

ఇందిరా శోభ‌న్ ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈమె వైసీపీ తెలంగాణ పార్టీ మాజీ నేత‌. కాగా ఆమ్ ఆద్మీ జాతీయ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో ఇందిరా ఆ పార్టీ కండువాని క‌ప్పుకున్నారు. జాతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ లో పూర్తి స్వేచ్ఛ‌గా ప‌ని చేస్తాన‌ని చెప్పారు. పార్టీని తెలంగాణ‌లో అభివృద్ధి చేస్తాన‌న్నారు. ఆమ్ ఆద్మీ సామాన్యుల పార్టీ అని తెలిపారు. అందుకే తాను ఆపార్టీ లో చేరాల‌ని అనుకున్నాన‌ని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ లో చేర‌డం సంతోషంగా ఉంద‌ని వెల్ల‌డించారు ఇందిరా శోభ‌న్‌. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌కీయ ముఖ చిత్రం మారిపోయింద‌న్నారు. ఒక సాధార‌ణ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని.. బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు ఒకే గొడుగు కింద ప‌ని చేస్తున్నాయ‌ని నిప్పులు చెరిగారు. కేంద్రంలో బ‌డా మోడీ, రాష్ట్రంలో చోట మోడీ అంటూ ఇందిరా శోభ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement