Tuesday, September 26, 2023

ఇండిగో నూత‌న చైర్మ‌న్ గా – వెంక‌ట‌ర‌మ‌ణి సుమంత్ర‌న్

ఇండిగో నూత‌న చైర్మ‌న్ గా వెంక‌ట‌ర‌మ‌ణి సుమంత్ర‌న్ ని నియ‌మించారు. ఇండిగో ఎయిర్ లైన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయనను ఛైర్మన్ గా ఎంపిక చేశారు. సుమంత్రన్ 2020 మే 28 నుంచి ఇండిగో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ గా ఉన్నారు. తన 37 ఏళ్ల ఉద్యోగ జీవితంలో అమెరికా, యూరప్, ఆసియా ఖండాల్లో వివిధ హోదాల్లో సుమంత్రన్ పని చేశారు. తాజాగా మాజీ ఛైర్మన్ దామోదరన్ నుంచి ఆయన బాధ్యతలను అందుకున్నారు. 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఛైర్మన్ బాధ్యతల నుంచి నిన్న దామోదరన్ వైదొలిగారు. మరోవైపు కొత్త ఛైర్మన్ గా సుమంత్రన్ ను ఆహ్వానిస్తున్నామని ఇండిగో ఎండీ రాహుల్ భాటియా తెలిపారు. అంతర్జాతీయ సర్వీసులను విస్తరించే క్రమంలో సుమంత్రన్ అనుభవం తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. గ్లోబల్ మార్కెట్లు, అంతర్జాతీయ లావాదేవీలు తదితర అంశాల్లో ఆయనకున్న అనుభవం చాలా గొప్పదని అన్నారు. ఇండిగో సంస్థ సుమంత్రన్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement