Friday, October 11, 2024

Breaking: ఇండియా భారీ విజయం.. 101 పరుగుల తేడాతో అఫ్గన్​పై గెలుపు!

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ధాటికి అఫ్గనిస్తాన్​ టాపార్డర్ వణికిపోయింది. భువనేశ్వర్ నిప్పులు చెరిగే బంతులకు ఆఫ్ఘన్ 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 213 పరుగుల భారీ టార్గెన్​ ఛేదించే క్రమంలో ఎంతో ధాటిగా ప్రారంభించాలని భావించిన అఫ్ఘన్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భువీ స్వింగ్ ను అర్థం చేసుకోలేక అఫ్గన్​ టాపార్డర్ బ్యాట్స్ మెన్ బోల్తాపడ్డారు.

భువీ కేవలం 2 ఓవర్లలో 4 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. అందులో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఇక.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన అఫ్గన్​ 111 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఇండియా 101 పరుగుల భారీ విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement