Thursday, April 25, 2024

దేశ‌వ్యాప్తంగా 478వందే భార‌త్ రైళ్లు.. ఆమోదం తెలిపిన కేంద్ర ప్ర‌భుత్వం

ఇప్ప‌టివ‌ర‌కు వందేభార‌త్ రైళ్ల‌న్నీ చైర్ కార్ మోడ‌ల్ లో త‌యారు చేశారు. కాగా ఇప్పుడు స్లీప‌ర్ క్లాస్ లో 400కొత్త వందే భార‌త్ రైళ్ల‌ని సిద్ధం చేయ‌నున్నారు. ఇందులో ఈ నెల 200 రైళ్ల తయారీకి టెండర్‌ ఖరారు చేయనున్నారు. ఈ 278 రైళ్లు గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడువనున్నాయి. రాబోయే రెండేళ్లలో 278 వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. 2027 వరకు మరో 200 రైళ్లు 2017 వరకు సిద్ధం కానున్నాయి. తొలి దశలో అందుబాటులోకి రానున్న వందే భారత్‌ రైళ్లు దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనున్నాయి. ప్రస్తుతం ఈ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ట్రాక్‌ల అప్‌గ్రేడేషన్‌, ఫెన్సింగ్‌ ఏర్పాట తర్వాత గరిష్ఠ వేగంతో నడువనున్నాయి. తొలి దశలో మొత్తం రైళ్లు పట్టాలెక్కిన తర్వాత వాటి వేగం గంటకు 200 కిలోమీటర్లకు పెరగనున్నది. దేశవ్యాప్తంగా 478 వందేభారత్ రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలిదశలో 78 రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రైళ్లన్నీ చైర్ కార్ మోడల్‌లో తయారు చేస్తున్నారు. అలాగే, స్లీపర్ క్లాస్‌లో 400 కొత్త వందే భారత్ రైళ్లను సిద్ధం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement