Thursday, April 25, 2024

గ‌ల్వాన్ లో క్రికెట్ తో పాటు ఐస్ హాకీ పోటీల్లో పాల్గొన్న.. భార‌త సైనికులు

గ‌ల్వాన్ లో క్రికెట్ తో పాటు ఐస్ హాకీ పోటీల్లో పాల్గొన్నారు భార‌త సైనికులు. గల్వాన్‌లో ఎక్కడ ఆటలు ఆడారనే విషయాన్ని ఆర్మీ స్పష్టంగా ఎప్పకపోయినా పెట్రోలింగ్‌ పాయింట్‌-14కు నాలుగు కిలోమీటర్ల దూరంలో సైనికులు ఆటలు ఆడి ఉండవచ్చని సమాచారం. త్రిశూల్ డివిజన్‌కు చెందిన పాటియాలా బ్రిగేడ్ ఆర్మీ పోటీలను నిర్వహించినట్లు సమాచారం. మరో వైపు సరిహద్దుల్లో సైన్యం గుర్రాలపై పహారా కాస్తుంది.ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్రమట్టానికి అధిక ఎత్తులో.. విపరీతమైన చలి పరిస్థితులు ఉన్నా వివిధ క్రీడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ జవాన్లు ఎంతో ధైర్యంతో ఉన్నారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. 2020 మేలో భారత్‌ – చైనా సైనికుల మధ్య గల్వాన్‌ ప్రాంతంలో ఘర్షణ జరిగిన విషయం విధితమే. ఈ ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందారు. పెద్ద సంఖ్యలో చైనా సైనికులు సైతం ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు చైనా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement