Thursday, April 25, 2024

కీవ్​లో భారత రాయబార కార్యాలయం రీ ఓపెన్​.. ఈనెల 17న పునః ప్రారంభం

ఉక్రెయిన్‌ దేశం కీవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఈ నెల17వ తేదీన తిరిగి ప్రారంభించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. “వార్సా [పోలాండ్] నుండి తాత్కాలికంగా పనిచేస్తున్న ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం 17వ తేదీని నుండి కీవ్‌లో తన కార్యకలాపాలను పునఃప్రారంభించనుంది. ఎంబసీని 13 మార్చి 2022న తాత్కాలికంగా వార్సాకు మార్చారు” అని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఉక్రెయిన్‌లో భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నందున, దేశంలోని పశ్చిమ ప్రాంతాలలో దాడులతో సహా, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని పోలాండ్‌లో తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఇప్పుడు మళ్లీ కీవ్​లో యథాతథంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement