Tuesday, April 23, 2024

జమ్ము కాశ్మీర్ లో భారీ మంచు తుపాను.. హిమపాతంలో చిక్కుకున్న 30 మందిని రక్షించిన సైన్యం..

జమ్మూ, కాశ్మీర్‌లో మంచు తుపాను కారణంగా టూరిస్టులకు కష్టలు మొదలయ్యాయి. చౌకీబాల్-తంగ్‌ధర్ రహదారిలో తప్పిపోయిన 30 మంది పౌరులను సాయుధ దళాలు రక్షించాయి. భారీగా కురుస్తున్న మంచు తుపాను ఈ ప్రాంతాన్ని తాకడంతో జాతీయ రహదారిపై ఖూనీ నాలా, SM హిల్ సమీపంలో ప్రయాణికుఉ మంచులో చిక్కుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టూరిస్టులు తమ వాహనాల్లో చిక్కుకుపోయారనే సమాచారం ఎన్‌సి పాస్‌లోని దళాలకు చేరిన వెంటనే ఇండియన్ ఆర్మీ రెస్క్యూ బృందాలు,జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (జిఆర్‌ఇఎఫ్) బృందాలను పంపారు.

జంట హిమపాతాల కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ 14 మంది పౌరులను రక్షించి నీలంకు,16 మంది పౌరులను సాధన పాస్ అని కూడా పిలువబడే NC పాస్‌కు తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. రక్షించబడిన పౌరులందరికీ రాత్రిపూట ఆహారం, వైద్యం, ఆశ్రయం కల్పించారు. రోడ్డు నుండి హిమపాతం, మంచు పెళ్లల క్లియరెన్స్ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు వాహనాలు తిరిగి వెళ్లాయి. కాగా ఈ రెస్క్యూ ఆపరేషన్ దాదాపు ఐదు నుండి ఆరు గంటలసేపు పట్టిందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement