Thursday, March 28, 2024

ICC T20 World Cup: ఫస్ట్​ టైమ్​ కప్​ కొట్టింది ఇండియానే.. మళ్లీ ఇప్పుడు ఇంకో చాన్స్​!

భారతీయులు ఎక్కువగా లైక్​ చేసే ఆట ఏదన్నా ఉందంటే అది క్రికెట్​ అని టక్కున చెప్పొచ్చు. మన దేశ క్రీడ హాకీ అయినా.. చాలామంది క్రికెట్​ అంటేనే ఇష్టపడతారు. ఆ ఆటలో ఉండే మజానే వేరు.. ఇక పాకిస్తాన్​ జట్టుతో మ్యాచ్​ ఉందంటే స్టేడియం ఏదైనా ఫుల్​ క్రౌడ్​ ఉంటుంది. ఆ రోజంతా రచ్చ రంబోలా అన్నట్టు సందడి సందడి, లొల్లి లొల్లిగా ఉంటుంది. ఇక.. ఇప్పుడయితే టీ20 వరల్డ్​ కప్​ ఫీవర్​తో జనాలున్నారు. భారత్​ సెమీస్​కు చేరుకుని రేపు ఇంగ్లండ్​తో తలపడనుంది. మరోవైపు న్యూజిలాండ్​తో ఇవ్వాల జరిగిన సెమీస్​లో పాకిస్తాన్​ గెలిచి ఫైనల్​కు చేరుకుంది. ఇట్లాంటి సిచ్యుయేషన్​లో ఇప్పటిదాకా ఐసీసీ టీ20 వరల్డ్​ కప్​ మ్యాచ్​లు ఎన్ని జరిగాయి.. ఏ ఏ జట్లు కప్పు కొట్టుకుపోయాయి. అన్న వివరాలు చదవి తెలుసుకుందాం..

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనేది ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. అయితే, ఐసీసీతో పాటు..2019లో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి కారణంగా .. గత ఐదేళ్లలో ఒక్క T20 ప్రపంచ కప్ ఈవెంట్ కూడా జరగలేదు. కానీ, అభిమానులు గత రెండేళ్లలో (2021, 2022) రెండు T20 ప్రపంచ కప్‌లను చూస్తున్నారు. గతసారి ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ సిరీస్​కు సంబంధించిన మొదటి టోర్నమెంట్ 2007 సంవత్సరంలో జరిగింది. ఈ ఏడాది అంటే 2022లో ఆస్ట్రేలియాలో ఈవెంట్​ జరుగుతోంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని రెండుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. అయితే.. 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచకప్ ట్రోఫీని ఐదుసార్లు గెలుచుకున్న ఆస్ట్రేలియా మాత్రం ఒక్కసారి కూడా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోలేకపోయింది. 2010లో వారు ట్రోఫీని గెలుచుకోవడానికి చాలా దగ్గర దాకా వచ్చారు. కానీ, ఫైనల్​ పోరులో తమ ప్రత్యర్థి ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయారు. ఇక.. 2014 T20 ప్రపంచ కప్ విజేత శ్రీలంక అయితే.. అనేక T20 ప్రపంచ కప్ ఫైనల్స్ దాకా చేరి ఓడిపోయింది. 2009, 2012లో వారు ఫైనల్​ పోరులో ఓటమి చెందిన రికార్డులున్నాయి.

01) 2007లో విజేతగా భారత్​

- Advertisement -

టీ20 ప్రపంచకప్‌ను తొలిసారిగా గెలుచుకున్నది భారత క్రికెట్ జట్టు. ఎంఎస్ ధోని సారథ్యంలో ఆడిన భారత్ ఫైనల్‌ పోరులో పాకిస్థాన్‌ను ఓడించి ఈ టోర్నీని గెలుచుకుంది. టోర్నమెంట్‌లో భాగంగా సూపర్ 8లలో న్యూజిలాండ్‌పై ఒక గేమ్‌ను మాత్రమే టీమిండియా ఓడిపోయింది. 

2009లో విజేత పాకిస్తాన్..

ఇక.. మొదటి T20 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన రెండేళ్ల తర్వాత 2009లో పాకిస్థాన్ ట్రోఫీని గెలుచుకుంది. 2009లో జరిగిన టీ20 వరల్డ్​ కప్​ టోర్నమెంట్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చింది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి పాకిస్థాన్ చాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో, శ్రీలంకతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. అయినప్పటికీ వారు ట్రోఫీని గెలుచుకోగలిగారు.

2010లో ఇంగ్లాండ్..

2010లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్​లో ఇంగ్లండ్​ గెలిచింది. అప్పుడు కప్పు గెలిచిన తొలి ఆసియాయేతర జట్టుగా చెప్పుకోవచ్చు. ఫైనల్లో ఇంగ్లండ్ తన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాను ఓడించింది. కానీ, ఇంగ్లండ్​ జట్టు వారి మొదటి మ్యాచ్​లోనే వెస్టిండీస్‌తో ఓడిపోయింది. అయినా వారు ఆ తర్వాత అన్ని మ్యాచ్​లను గెలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు.

2012 విజేతగా – వెస్టిండీస్..

వెస్టిండీస్ జట్టు ICC T20 వరల్డ్ కప్ 2012లో గెలుచుకుంది. అయితే.. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో విండీస్​ ఓడిపోయింది. అయినప్పటికీ ట్రోఫీని గెలుచుకుంది. సమ్మిట్ పోరులో కరీబియన్ జట్టు ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. ఇక.. T20 ప్రపంచ కప్ 2012 ఫైనల్‌లో మార్లోన్ శామ్యూల్స్‌ అద్భుతంగా ఆడాడు.  

2014లో విజేతగా- శ్రీలంక..

శ్రీలంక 2014లో భారత్‌ను ఓడించి T20 ప్రపంచ కప్ విజేతగా అవతరించింది. గ్రూప్ దశలో ఇంగ్లండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో లంక జట్టు ఓటమి చెందింది. అయితే వారు వరుసగా ఇతర మ్యాచ్‌లలో గెలుపొందారు. 

2016లో విజేతగా మళ్లీ –వెస్టిండీస్..

రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. 2016లో భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కరీబియన్‌ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోయింది. వారు ఇతర ప్రత్యర్థులందరినీ ఓడించారు.

2021లో ఆస్ట్రేలియా ..

కరోనా మహమ్మారి రూల్స్​ అండ్​ రెగ్యులేషన్స్​ మధ్య జరిగిన టీ20 వరల్డ్​ కప్​లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. గత ఏడాది యునైటెడ్​ స్టేట్స్​ ఆఫ్​ అరబ్​ ఎమిరేట్స్​లో జరిగిన పోరులో న్యూజీలాండ్​పై ఆస్ట్రేలియా గెలుపొంది కప్పు గెలుచుకుంది. ఇక ఈ సారి ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్​ కప్​లో మాత్రం ఆస్ట్రేలియా గ్రూప్​ దశలోనే ఎలిమినేట్​ కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement