Wednesday, March 27, 2024

WTC Finals | తొలిరోజు ఆసీస్​దే పైచేయి.. భారత బౌలర్లపై పెరిగిన ఒత్తడి

డబ్ల్యూటీసీ ఫైనల్స్​లో తొలిరోజు ఆసీస్​ పైచేయి కనబర్చింది. బౌలర్లకు అనుకూలమైన ఓవల్​ పిచ్​మీద ఆస్ట్రేలియా ఆట ప్రారంభంలోనే కీలకమైన ఉస్మాన్ ఖ్వాజా (0) వికెట్​ని కోల్పోయింది. అయితే.. సౌత్ లండన్‌లోని ఈ ​ మైదానంలో ఆస్ట్రేలియాకు చెందిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ 146* పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక.. వైస్​ కెప్టెన్​ స్టీవ్​ స్మిత్​ 95* హిట్టింగ్స్​తో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆసీస్​ జట్టు కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోయి.. 327 పరుగులు చేసింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

డబ్ల్యూటీసీ ఫైనల్స్​ ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య టెస్ట్​ మ్యాచ్​ జరుగుతోంది. ఇంగ్లండ్​లోని ఓవల్​ మైదానంలో జరుగుతున్న 2023 ఎడిషన్ టైటిల్ డిసైడ్‌ మ్యాచ్​లో ఆస్ట్రేలియా బ్యాటర్​ ట్రావిస్​ హెడ్​ తన మొదటి సెంచరీ సాధించాడు. 2021లో జరిగిన డబ్ల్యూటీసీ ప్రారంభ ఎడిషన్ ఫైనల్‌లో సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో ఎవరూ ట్రిపుల్ ఫిగర్‌లను చేరుకోలేకపోయారు.

కానీ, 2023 టైటిల్ డిసైడర్ ప్రారంభ మ్యాచ్​లో లెఫ్ట్ హ్యాండర్ హెడ్ తన టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ లోని 65వ ఓవర్‌లో మహ్మద్ షమీ బౌలింగ్​లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఆకాశం మేఘావృతమైన పరిస్థితుల్లో ఓవల్‌లోని పచ్చని పిచ్‌లో భారత్ టాస్ గెలిచి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

- Advertisement -

కాగా, బ్యాటింగ్‌కి వచ్చిన ఆస్ట్రేలియా రెండు వికెట్లు త్వరగా కోల్పోయింది. ఈ సమయంలో హెడ్ తన స్ట్రోక్‌లను రొటేట్​ చేస్తూ.. స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. ఎలాంటి సంకోచం లేకుండా కట్టింగ్, పుల్లింగ్ చేస్తూ ఉమేష్ యాదవ్ బౌలింగ్​లో బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ లంచ్‌కు ముందు అర్ధ సెంచరీని చేరుకున్నాడు.. టీ విరామం తర్వాత 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అతని జట్టును 170/3కి నడిపించాడు.

ఇక.. స్టీవ్ స్మిత్‌తో కలిసి ఈ జోడీ 76-/3  వద్ద చేతులు కలిపిన తర్వాత.. నాలుగో వికెట్‌కు 150 పరుగులకు పైగా జోడించారు. హెడ్ ​​ దూకుడుతో ఇండియన్​ బౌలర్లపై ఒత్తిడిని పెరిగింది. వైడ్​ బాల్స్​, షార్ట్​ లెంగ్త్​, యార్కర్స్​ అని చూడకుండా హెడ్​ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డుని పరుగులుపెట్టించాడు. ఇట్లా తొలిరోజు ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement