Friday, March 29, 2024

India Corona: దేశంలో కరోనా తగ్గేదే లే.. లక్షకు చేరువైన కేసులు!

భారత్ లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువ అవుతున్నాయి. దీంతో దేశంలో థర్డ్ వేవ్ మొదలైందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 90,928 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనాతో 325 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,82,876కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,43,41,009 కు చేరింది. ఇక దేశంలో 2,85,401 యాక్టివ్ కరోనా కేసుల ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.46 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 148.67 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement