Tuesday, September 26, 2023

త‌గ్గుతోన్న క‌రోనా కేసులు – హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన కేంద్ర ఆరోగ్య‌శాఖ‌

గ‌డిచిన 24గంట‌ల్లో దేశంలో 34,113కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కాగా క‌రోనా క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య‌శాఖ హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేసింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,78,882 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 93.18 శాతంగా ఉంది. దేశ వ్యా ప్తంగా రికవరీల సంఖ్య 4,16,77,641 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,72,95,87,490 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే ఇప్పటి వరకు 11,66,993 మందికి కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక నిన్న ఒక్క రోజే 346 మంది కరోనా తో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5,09,011 చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో.. 91930 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement