Wednesday, April 24, 2024

దేశంలో తగ్గని కరోనా కేసులు.. పెరిగిన రికవరీ రేటు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 28,046 మంది బాధితులు కోలుకోగా.. 290 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కొత్తగా నమోదైన కేసుల్లో 17,983 కేసులు కేరళలోనే ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో నిన్న 127 మంది మరణించారని వెల్లడించింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కు చేరింది. ఇందులో 3,28,76,319 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడ్డారు. రికరీ రేటు 97.78 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా కరోనాతో 4,46,658 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 3,01,442 యాక్టివ్‌గా కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,04,051 మందికి వ్యాక్సినేషన్‌ పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 84,89,29,160 కరోనా వ్యాక్సిన్‌ డోసులను వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇది కూడా చదవండిః కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తీవ్రత తక్కువే!

Advertisement

తాజా వార్తలు

Advertisement