Saturday, April 20, 2024

India Corona: దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా

దేశంలో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,313 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 181 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 26,579 మంది బాధితులు కోలుకున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత రోజువారిగా నమోదయ్యే కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గడం గమనార్హం. అయితే, కేరళలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేరళలో మొత్తం 6,996 కేసులు నమోదు కాగా.. 84 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,85,920కి పెరిగింది. మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,33,20,057 కి చేరింది. దీంతోపాటు మరణాల సంఖ్య 4,50,963కి పెరిగింది.

దేశంలో ప్రస్తుతం 2,14,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 95,89,78,049 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న దేశవ్యాప్తంగా 65,86,092 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: రాయచూర్ ను తెలంగాణలో కలిపేయాలి: బీజేపీ ఎమ్మెల్యే

Advertisement

తాజా వార్తలు

Advertisement