Saturday, April 20, 2024

అలర్ట్: కరోనా మూడో వేవ్ వస్తోంది: ఎయిమ్స్ డైరెక్టర్

దేశంలో కరోనా కేసులు, మరణాల పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలో మరోసారి లాక్ డౌన్ పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించలేవని, రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌ డౌన్‌ తో ఎలాంటి ప్రయోజనం లేదని అయన వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కరోనాను అడ్డుకోవాలంటే సంపూర్ణ లాక్‌ డౌనే ఏకైక పరిష్కారం అని గులేరియా స్పష్టం చేశారు.

కరోనా కట్టడికి మూడు మార్గాలు సూచించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచడం, మూడో వేవ్‌ కట్టడికి వ్యాక్సిన్లు వేగం పెంచడం, ప్రజలు భౌతిక దూరం తప్పకుండా పాటించాలని, ఎక్కడా గుంపులుగా తిరగొద్దని పేర్కొన్నారు. ఈ చర్యలు తీసుకుంటే కేసులు తగ్గేందుకు ఆస్కారం ఉందని రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌ డౌన్‌ లాంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలస్యం చేస్తే అమెరికా పరిస్థితే మనకూ వస్తుందని, లాక్‌డౌన్‌ లాంటి నిర్ణయం తీసుకుంటూనే ప్రజలకు నిత్యావసరాలతో పాటు రోజువారీ కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలని గులేరియా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement