Thursday, April 25, 2024

ఇండియాకి.. మాఫియా కింగ్ ఎస్కోబార్ ఆఫ్రికా హిప్పోలు

ఆఫ్రికా హిప్పోలు ఇండియాకి రానున్నాయి. కొలంబియాకి చెందిన మాఫియా కింగ్ ఎస్కోబార్ మ‌ర‌ణంతో ఆయ‌న పెంచుకున్న హిప్పోల‌ని ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు.1980వ సంవ‌త్స‌రంలో ఎస్కోబార్ ఆఫ్రికా నుంచి కొన్ని హిప్పోల‌ను త‌న దేశానికి తెచుకున్నాడు. కానీ 1993లో అత‌న్ని హ‌త‌మార్చిన త‌ర్వాత ఆ హిప్పోలు స్వేచ్ఛ‌గా తిర‌గ‌డం మొద‌లుపెట్టాయి. ఆంటియోకియాలో ఉన్న చిత్త‌డి నేలల్లో ఫ్రీగా మూవ్ అయ్యాయి. అయితే ఇప్పుడు వాటి సంఖ్య 150 దాటింది. ఇక వాటిని కొలంబియా పెంచుకోలేక‌పోతున్న‌ది. ఈ నేప‌థ్యంలో స్థానిక ప్ర‌భుత్వం ఓ ఐడియాకు వ‌చ్చింది. దాదాపు 70 హిప్పోల‌ను విదేశాల‌కు త‌ర‌లించాల‌ని చూస్తుంది. హిప్పోల్లో సుమారు 10 జంతువుల‌ను మెక్సికోలో ఉన్న ఓస్టాక్ వన్య‌ప్రాణి కేంద్రానికి త‌ర‌లించ‌నున్నారు. అయితే మ‌రో 60 హిప్పోల‌ను మాత్రం ఇండియాకు పంపాల‌న్న ఆలోచ‌న‌లో కొలంబియా ఉన్న‌ట్లు ఓ రిపోర్టు ద్వారా తెలిసింది. ఇండియాలో ప్ర‌స్తుతం హిప్పో జాతికి చెందిన రైనోలు ఉన్నాయి. అస్సాంలో ఉన్న ఖాజీరంగా జాతీయ అట‌వీ క్షేత్రంలో రైనోలు ఉన్నాయి.అయితే హిప్పోల‌ను వ‌దిలించుకోవాల‌నుకుంటున్న కొలంబియాకు.. ఆ జంతువుల్ని త‌ర‌లించేందుకు సుమారు 3.5 మిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement