Thursday, April 25, 2024

కరోనా కేసుల్లో బ్రెజిల్ ను దాటేసిన భారత్..

 భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. నిత్యం కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 24 గంటల వ్యవధిలో లక్షన్నర పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా ప్రభావిత దేశాలలో బ్రెజిల్‌ను వెనక్కినెట్టి భారత్ రెండో స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్, భారత్ దేశాలలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. కరోనా మరణాలు సైతం ఈ దేశాల్లోనూ అధికంగా సంభవిస్తున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో దేశంలో 1,68,912 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 1,35,27,717కు చేరింది. ప్రపంచ దేశాల్లో ఇప్ప‌టివ‌ర‌కు అగ్ర‌రాజ్యం అమెరికాలోనే అత్య‌ధికంగా 3,19,18,591 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ త‌ర్వాత 1,34,82,543 క‌రోనా కేసులతో బ్రెజిల్‌లో రెండో స్థానంలో ఉండేది. అయితే గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 1.68 ల‌క్ష‌ల‌కుపైగా కొత్త కేసులు న‌మోదుకావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య బ్రెజిల్ కేసుల‌ను దాటేసి 1,35,27,717కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement