Thursday, March 28, 2024

దేశంలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు

ఇండియాలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. రోజువారి కేసుల సంఖ్య ఇప్పుడు 50 వేల వైపు పరుగులు తీస్తోంది. దీంతో థార్డ్ వేవ్ వస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 47,092 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూవాయి.. మరో 509 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 35,181 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు దేశ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937కు చేరుకోగా.. రికవరీ కేసులు 3,20,28,825కి పెరిగాయి.. ఇక, కోవిడ్‌ బారినపడి ఇప్పటి వరకు 4,39,529 మంది మృతిచెందగా.. ప్రస్తుతం దేశంలో 3,89,583 మంది యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 81,09,244 డోసుల వ్యాక్సిన్‌ వేయగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 66,30,37,334 వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

ఇది కూడా చదవండి: చోరి చేసి కాళ్లు మొక్కిన దొంగలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement