Tuesday, October 26, 2021

దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు..

దేశంలో కరోనా పెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గడం లేదు. ప్రతిరోజు 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 22,842 క‌రో నా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. 25,930 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,30,94,529కు చేరింది. నిన్న క‌రోనాతో 244 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,48,817కు పెరిగింది.  ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,70,557 మంది చికిత్స తీసుకుంటున్నారు. కేర‌ళ‌లో నిన్న ఒక్క‌రోజులోనే 13,217 మందికి క‌రోనా సోకింది. ఆ రాష్ట్రంలో క‌రోనాతో నిన్న‌ 121 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 90,51,75,348 క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను వినియోగించారు. 

ఇది కూడా చదవండి: ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా.. జిల్లాల్లో నమోదైన కేసులు ఇవే..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News