Wednesday, April 17, 2024

CM KCR : దూప, దీప నైవేద్యానికి నిధుల పెంపు..

హైదరాబాద్ : ఇప్పటి వరకు ధూపదీప నైవేద్యం పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తుంద‌ని.. ఈ మొత్తాన్ని రూ. 10 వేలకు పెంచుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్‌పల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో బ్రాహ్మణుల సంక్షేమాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. వేదశాస్త్ర పండితులకు ప్రతి నెల ఇస్తున్న గౌరవభ వృతిని రూ.2,500 నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది అని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూపదీప నైవేద్యం పథకం విస్తరింపజేస్తాం. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాయాలకు ధూపదీప నైవేద్యం కింద నిర్వహణ వ్యయం అందుతుంది. ఈ నిర్ణయం మీ అందరిని ఎంతో సంతోషపెడుతుందని భావిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న రూ. 2 లక్షలను ఇక నుంచి యాన్యువల్ గ్రాంట్‌గా ఇస్తామని తెలియజేస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింజేసే నిర్ణయం తీసుకున్నాం. అదే విధంగా అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో కేబినెట్‌లో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను. సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా, వేద పురాణాల ఇతిహాసంగా, విజ్ఞాన సర్వసంగా, వైదిక క్రతువుల కరదీపికగా, పేద బ్రాహ్మణుల ఆత్మబంధువుగా, లోక కల్యాణకారిగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ విప్రహిత వెలుగొందాలని ఆ దేవ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించుకున్న నేటి శుభ సందర్భంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదశాస్త్ర పండితులకు ప్రతి నెల ఇస్తున్న గౌరవ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నాం. ఈ భృతిని పొందే అర్హత వయసును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు తగ్గిస్తున్నాం అని కేసీఆర్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement