Monday, December 4, 2023

28నుంచి కొత్త ట్రాఫిక్​ రూల్స్ అమలు.. ట్రిపుల్​ రైడింగ్​, రాంగ్​ రూట్​ డ్రైవింగ్​కు దిమ్మదిరిగేలా ఫైన్​

హైదరాబాద్​ సిటీలో ట్రాఫిక్​ రూల్స్​ పాటించకుంటే ఇక మీదట గూబ గుయ్​ మనేలా ఫైన్​ వేయనున్నారు పోలీసులు. ఇప్పటిదాకా 100, 500 రూపాయలున్నా ఫైన్​ ఇకపై 1700 రూపాయలకు చేరింది. రాంగ్​ రూట్​ డ్రైవింగ్​ చేస్తే వాహనదారులకు 1700 రూపాయల జరిమానా విధించనున్నట్టు ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ట్రిపుల్​ రైడింగ్​ చేసిన వారికి 1200 రూపాయల ఫైన్​ వేయనున్నారు.

- Advertisement -
   

ఈ పెంచిన ఫైన్​ ఈ నెల 28వ తేదీ నుంచి అమల్లోకి తెస్తామని పోలీసులు వెల్లడించారు. అందుకని వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాహనదారులను కోరుతున్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తూ ట్రాఫిక్​ రూల్స్​ని పాటించకుండా బండి నడిపితే జేబుకు పెద్ద బొక్క పడే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement