Friday, April 19, 2024

ఎండు స‌ముద్ర గుర్రాలు అక్ర‌మంగా త‌ర‌లింపు.. నిందితుడి అరెస్ట్

ఐదు కిలోల ఎండు స‌ముద్ర గుర్రాల‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డ్డాడు ఓ నిందితుడు.వీటిని పచ్చివిగా, ఎండబెట్టి కూడా కొందరు అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం సిలిగురి జిల్లాలోని నక్సల్‌బరిలో ఫయాజ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి.. ఐదు కిలోల ఎండు సముద్ర గుర్రాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. ఘోష్‌పుకూర్‌ రేంజ్‌లోని కుర్సియాంగ్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సముద్రపు గుర్రాలు.. అంటే ఇవి నిజంగా గుర్రాలు కావు.. గుర్రాల ముఖాలను పోలిన ముఖంతో ఉండే ఒక రకం చేపలు. ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి.. అందుకే వీటి వేటపై నిషేధం అమల్లో ఉంది..కానీ కొందరు అక్రమంగా చేపలతోపాటు వీటిని కూడా పట్టి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement