Thursday, April 25, 2024

పోరాటం చేస్తే.. జైల్లో వేస్తారా.. రాహుల్ గాంధీ

నియంతృత్వ పోక‌డకు వ్య‌తిరేకంగా పోరాటం చేసిన‌వాళ్ల‌పై దారుణంగా అటాక్ చేస్తున్నార‌ని, పోరాటం చేస్తే జైలులో వేస్తారా అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ‌తాబ్ధం క్రిత‌మే ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన ఇండియాను మ‌న కండ్ల ముందే నాశ‌నం చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. తాము ప్ర‌జ‌ల కోసం పోరాటం చేస్తున్న‌ట్లు తెలిపారు. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని, నిరుద్యోగం పెరిగింద‌ని, స‌మాజంలో హింస కూడా అధిక‌మైన‌ట్లు రాహుల్ అన్నారు. కానీ వీటి గురించి మాట్లాడ‌కుండా ప్ర‌భుత్వం విప‌క్షాల‌ను అణిచివేస్తోంద‌న్నారు. కేవ‌లం న‌లుగురు లేదా అయిదుగురి ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌ని, ఇద్ద‌రు ముగ్గురు చేసిన వ్యాపారానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందోని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement