Saturday, December 10, 2022

ఎమ్మెల్యేలను కొనడానికి వస్తే.. అరెస్ట్ చేయొద్దా ? .. కవిత

ఎమ్మెల్యేలను కొనడానికి వస్తే.. అరెస్ట్ చేయొద్దా ? అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ… తెలంగాణలో భయపడే వాళ్లు ఎవరూ లేరని అన్నారు. రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారన్నారు. బీఎల్ సంతోష్ విచారణకు రమ్మంటే కోర్టుకు వెళ్లారన్నారు. రాజకీయంగా గట్టిగా ఉన్న వాళ్లను గద్దల్లా ఎత్తుకుపోవాలనేదే బీజేపీ ప్లాన్ అన్నారు. తప్పు చేయకపోతే బీఎల్ సంతోష్ కు భయమెందుకు అని అన్నారు. నెలరోజులుగా మంత్రులపై దాడులు జరుగుతున్నాయన్నారు. విచారణ చేసుకోండి.. పత్రాలు చూసుకోండని కవిత అన్నారు. బండి సంజయ్ యాదాద్రి దొంగ ప్రమాణం చేశారన్నారు. మనదగ్గర దొరికితే విచారన చేయొద్దా అని ప్రశ్నించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement