Thursday, April 25, 2024

కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తీవ్రత తక్కువే!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. రోజువారి కేసులు ఒరోజు తగ్గుతూ.. మరోరోజు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం 30 వేల  కేసులు నమోదు అవుతున్నాయి. అత్యధికంగా కేరళలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అక్టోబర్, నవంబర్ మాసంలో థర్డ్ వేవ్ వచ్చే ముప్పు ఉందని నిపుణుల అంచనాలు ఉన్నాయి.  అయితే మూడో దశ వచ్చినా.. దాని ప్రభావం పెద్దగా ఉండబోదని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్​ఐఆర్​) వెల్లడించింది.

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 84 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో ఫస్ట్, సెకండ్ డోసులు వేసుకున్నారు. వైరస్‌ను చాలా వరకు నివారించే శక్తి మన టీకాలకు ఉంది. దీంతో థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా ఉండదని సీఎస్​ఐఆర్​ డైరెక్టర్ ఖర్‌ సి మండే చెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినా.. దాని తీవ్రత పెద్దగా ఉండదన్నారు. ఒకవేళ మూడో దశ వచ్చినా.. రెండో దశతో పోలిస్తే తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండిః దళితుల భూమి.. దర్జాగా కబ్జా..!

Advertisement

తాజా వార్తలు

Advertisement