Wednesday, February 8, 2023

అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు, ఫ్రీ కరెంట్.. కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు, ఫ్రీకరెంట్ ఇస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్రం నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టి చోద్యం చూస్తోందని కేసీఆర్ విమర్శించారు. స్వాతంత్య్యం వచ్చిన 75ఏండ్ల తర్వాత కూడా నీటి యుద్దాలు ఎందుకని ప్రశ్నించారు. దశాబ్దాల క్రితం కట్టిన ప్రాజెక్టులు తప్ప కొత్తవి మళ్లీ కట్టలేదని, ఏండ్లు గడుస్తున్నా నీటి వివాదాలు పరిష్కారం కావడం లేదని అన్నారు. రేపో మాపో హరి అనేటోళ్లను ట్రైబ్యునళ్లలో కూర్చోబెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మిషన్ భగీరథ తరహాలో ఐదేళ్లలో ఇంటింటికీ మంచి నీళ్లు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

- Advertisement -
   

దేశంలో 4లక్షల10వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉన్నా.. తెలంగాణ తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరెంటు సమస్య ఎందుకుందని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్​ భావజాలం ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశంలో వెలుగుజిలుగులు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. కష్టాలు కన్నీళ్ల నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. సహజ వనరులు ప్రజలకు దక్కేలా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని ప్రకటించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోడీ హయాంలో తెలంగాణలో తప్ప దేశమంతటా కరెంటు కోతలే ఉన్నాయని విమర్శించారు. అసలు దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, లక్షల కోట్ల సంపద ఏమైపోయిందో తెలియడం లేదని కేసీఆర్ వాపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement