Sunday, May 28, 2023

మోస‌పూరిత సంస్థ‌ల‌కు స‌హ‌క‌రించ‌వ‌ద్దు..అమితాబ్ కి స‌జ్జ‌నార్ రిక్వెస్ట్

తెలంగాణ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ త‌న వృత్తితో పాటు సామాజిక అంశాల‌పై స్పందిస్తుంటారు..ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. కాగా సెలబ్రెటీలు ఆమ్వే లాంటి మోసపురిత సంస్దలకు సహకరించవద్దని బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ ని రిక్వెస్ట్ చేశారు స‌జ్జ‌నార్. దేశ ఆర్ధిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి ఫేక్ సంస్ధలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని అభ్యర్ధించారు. సెలబ్రెటీలు ఎవరూ ఇలా చేయవద్దని సూచించారు. అమితాబ్ లాంటి స్టార్ న‌టులు ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం సరికాదని సజ్జనార్ సూచించారు.ఈ మేరకు ఆమ్వే సంస్ధలకు సహకరించవద్దని ట్విట్టర్‌లో అమితాబ్ బచ్చన్‌కు ట్యాగ్ చేసి సజ్జనార్ కోరారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అమితాబ్ బచ్చన్‌కు ట్విట్టర్‌లో రిక్వెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయ‌న చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement