Tuesday, March 26, 2024

Breaking: నేను ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు : జ‌గ్గారెడ్డి

కాంగ్రెస్ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంతరావుతో పాటు సీనియ‌ర్ నేత‌లు జ‌గ్గారెడ్డి ఇంటికెళ్లారు.జ‌గ్గారెడ్డిని బుజ్జ‌గిస్తున్నారు. అయితే జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ…. పార్టీలో త‌న‌కు అవ‌మానం జ‌రుగుతోంద‌న్నారు. తాను సీఎంను పొగ‌డ‌డంపై త‌ప్పుగా ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు. కాంగ్రెస్ పై అవ‌గాహ‌న లేని వాళ్లు ఇబ్బంది పెడుతున్నార‌న్నారు. నా అనుచ‌రులు కూడా ఇబ్బంది ప‌డుతున్నార‌న్నారు. అలాగే మ‌ధ్యాహ్నం కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని జ‌గ్గారెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement